Arjuna Veta Movie Launch | Madhu Sai Vamshi | Sravani | Himabindhu || Filmibeat Telugu

2019-06-24 3

Arjuna Veta film, which is being produced by Vayaala Srinivasa Rao under the banner of Roja Srinivas Cinemas launched in Hyderabad.Madhu sai vamshi,sravani,himabindhu are the main lead in this film
#Arjuna Veta
#MadhuSaiVamshi
#Sravani
#Himabindhu
#SrinivasaRao


మధు సాయివంశీ హీరోగా, శ్రావణి నిక్కీ, హిమబింధు హీరోయిన్లుగా కె.రవీంద్ర కల్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జునవేట’. రోజా శ్రీనివాస్‌ సినిమాస్‌ పతాకంపై వాయల శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రైస్‌ పుల్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. జూలై 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెడతాం. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. సుబ్బరాజు, ‘వెన్నెల’ కిశోర్, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: డి. ఇమామ్‌.